సహజసిద్ధమైన ఉత్పత్తులతో తయారుచేసిన నాణ్యమైన ఉత్పత్తి అజినోమోటో (ఎంఎస్‌జీ)

గురువారం, 3 డిశెంబరు 2020 (15:24 IST)
పాల నుంచి పెరుగు తయారుచేసినట్లుగా, అతి సరళమైన కిణ్వ ప్రక్రియతో మోనోసోడియం గ్లుటమేట్‌(ఎంఎస్‌జీ)ను తయారుచేస్తారు. అతి సహజమైన పదార్థాలైనటువంటి చెరుకు, షుగర్‌ -బీట్‌ (చిలకడ దుంప లాంటిది) లేదా కర్రపెండలం (టపియోకా) ద్వారా ఎంఎస్‌జీని  తయారుచేస్తారు. ఈ ఎంఎస్‌జీని అజినోమోటో పేరుగల కంపెనీ చెరకు, కర్రపెండలం నుంచి తయారుచేస్తుంది.  ఫుడ్‌ మెనూ/డిషెస్‌ రుచిని వృద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. మీరు దీనిని సాంబారు, రసం, కూరగాయల ఫ్రైస్‌, సూప్‌లు, కూరలలో వాడవచ్చు. పులుపు మరియు తియ్యదనం కలిగిన ఏ డిష్‌లో అయినా దీనిని వాడటం వల్ల వీటి రుచి మరింతగా పెరుగుతుంది.
 
అసలైన/స్వచ్ఛమైన అజి-నో-మోటోను అజినోమోటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ చేస్తుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ లైసెన్స్‌ కలిగి ఉండటంతో పాటుగా దీని భద్రత మరియు నాణ్యతను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిరూపించింది. నకిలీ అజి-నో-మోటో పట్ల వినియోగదారులు ఆప్రమప్తంగా ఉండాలి. అసలైన అజి-నో-మోటోను ఎంచుకోవడానికి అతి సహజమైన పద్ధతి  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లోగో మరియు లైసెన్స్‌ నెంబర్‌ను ప్యాకేజీ యొక్క వెనుక వైపు పరీక్షించి, నిర్ధారించుకోవడం.
 
జపాన్‌ కేంద్రంగా తమ ఉత్పత్తులను  ప్రపంచవ్యాప్తంగా అజినోమోటో విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులు సురక్షితమైనవి మరియు ప్రమాదకరం కానటువంటివని నిరూపించడం కోసం మేము అత్యున్నత నాణ్యతా ప్రక్రియలను  పర్యవేక్షించే సంస్థల నుంచి ప్రతి దేశంలోనూ అనుమతులను పొందడం జరిగింది. భారతదేశంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి అందించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, జపాన్‌, థాయ్‌ల్యాండ్‌, ఇండియాలలో భద్రతా సర్టిఫికెట్లను అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించిన తరువాత అందించారు. మేము రుచిని మెరుగుపరిచే మోనో సోడియం గ్లుటమేట్‌, అజి-నో-మోటో (ఉమామీ టేస్ట్‌ ఎన్‌హాన్సర్‌)ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ చేస్తున్నాము. దీనిని అతి సహజసిద్ధమైన పదార్థాలతో, ఎలాంటి రసాయనాలూ జోడించకుండా తయారుచేస్తున్నాము. అందువల్ల ఇది ఆరోగ్యానికి మంచిది.
 
కానీ, ప్రపంచవ్యాప్తంగా చైనీస్‌ మరియు స్థానికంగా తయారుచేసిన నకిలీ ఉత్పత్తులు, తప్పుడు లేబుల్స్‌తో వరదలా వస్తున్నాయి. వినియోగదారులు ఈ తరహా ఉత్పత్తుల పట్ల ఆప్రమప్తంగా ఉండాలి మరియు అసలైన ఎంఎస్‌జీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి.  ‘‘మా వంతుగా, మేము వీలైనంత వరకూఅన్ని జాగ్రత్తలనూ తీసుకోవడం ద్వారా నకిలీ ఉత్పత్తులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాము’’ అని భారతదేశంలో అజినోమోటో యొక్క మార్కెటింగ్‌  మేనేజర్‌ శ్రీ గోవింద బిశ్వాస్‌ అన్నారు.
 
శ్రీ అత్సుషి మిషుకు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ - అజినోమోటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘చెన్నై సమీపంలో ఉన్న కాంచీపురం వద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా, వీలైనంత వేగంగా పంపిణీ మరియు మార్కెట్‌ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎంఎస్‌జీ నాణ్యత పరంగా దీనిలో వాడే ఒక పదార్థం గ్లూటమేట్‌, తల్లిపాలలో కూడా ఉంటుంది. తల్లిపాలలో కూడా ఇది ఉండటం వల్ల శిశువులకు సైతం వినియోగించేందుకు అనుకూలంగా ఉంటుంది’’ అని అన్నారు.
 
ఆయనే మరింతగా చెబుతూ, ‘‘అజినోమోటోతో పాటుగా  మేము ఫ్రైడ్‌ రైస్‌ తయారుచేసేందుకు పూర్తి సీజనింగ్‌, హప్పిమా ఫ్రైడ్‌ రైస్‌ మిక్స్‌; 3-ఇన్‌-1 ఇన్‌స్టెంట్‌ కాఫీ మరియు మసాలా ఛాయ్‌ మిక్స్‌, బ్లెండీ ; ఇంటి వద్దనే క్రిస్పీ ఫ్రైడ్‌ రెస్టారెంట్‌ తరహా చికెన్‌ మరియు ఏ అండ్‌ ఎం నూడిల్స్‌ తయారుచేసుకునేందుకు హప్పిమా క్రిస్పీ ఫ్రై మిక్స్‌ కూడా తయారుచేస్తున్నాం. ఈ ఉత్పత్తులకు మార్కెట్‌లో ప్రోత్సాహకరమైన అమ్మకాలు ఉన్నాయి. మీ మద్దతు మరియు ఆశీర్వాదంతో, మరింత ఉత్తమంగా సేవలను అందించనున్నాం’’ అని శ్రీ అత్సుషి మిషుకు అన్నారు.
 
ప్రస్తుత వాతావరణంలో, భార్యాభర్తలిరువురూ పనిచేసినప్పుడు మాత్రమే కుటుంబం ఆనందంగా ఉండగలదు. తరువాత రోజుకోసం రేడీమేడ్‌ పిండి కొనుగోలు చేయడం భర్తలు తరచుగా జరిగేది. ఒకే సమయంలో భార్యాభర్తలు పనికోసం బయటకు వెళ్లడం వల్ల, వంట చేసుకోవడం అతి కష్టసాధ్యమైన అంశంగా  నిలిచింది. దురదృష్టవశాత్తు, ప్రస్తుత తరం ఈ బాధలు పడకుండా ఉండటం కోసం బ్రేక్‌ఫాస్ట్‌ను హోటల్స్‌లో, ఆఫీస్‌ క్యాంటిన్‌లలో లంచ్‌ చేస్తున్నారు.
 
‘ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం’ఇప్పుడు సరిగా లభ్యం కావడం లేదు. ఈ కష్టకాలంలో, కొన్ని మోసపూరిత కంపెనీలు నకిలీఉత్పత్తులు విడుదల చేయడంతో పాటుగా ఇతర ఉత్పత్తులను పోలినట్లుగా ఉత్పత్తులనూ విడుదల చేస్తుంది. 90% మంది భారతీయులు తక్కువ ధర కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ అంశాన్ని మోసపూరిత కంపెనీలు అనుకూలంగా మలుచుకుంటున్నాయి.
 
ఇక ఇంటర్నెట్‌లో కొంతమంది అజినోమోటో వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని కూడా ప్రచారం చేస్తున్నారు. తద్వారా వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ వాస్తవాలు నిజమా ? మనలో అతి కొద్ది మంది మాత్రమే అలాంటి సమాచారం నిజమని భావిస్తున్నారు మరియు వాస్తవం మరియు నకిలీ నడుమ తేడాను గుర్తిస్తున్నారు. ఈ నెగిటివ్‌ పబ్లిసిటీకి వ్యతిరేకంగా తగిన చర్యలను జపనీస్‌ కంపెనీ అజినోమోటో తీసుకుంటుంది. కనీసం ఇప్పటి నుంచైనా, ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి అంశాన్నీ గుడ్డిగా నమ్మడం కన్నా, నీటి నుంచి పాలను వేరు చేసే హంసలా ప్రతిభ కలిగి ఉండటంతో పాటుగా కేవలం వాస్తవం మాత్రమే నమ్మాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు