కేంద్ర ప్రభుత్వం లోన్ మారటోరియం గడువుకు సంబంధించి వడ్డీ మీద వడ్డీ పడకుండా ఉండే నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయంతో హోమ్‌లోన్ తీసుకున్న వారి కంటే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి వడ్డీమీద వడ్డీ మినహాయింపు వల్ల ఎక్కువ బెనిఫిట్ కలుగనుంది. క్రెడిట్ కార్డు రుణాలు, బకాయిలు కలిగిన వారికి ప్రయోజనం అధికంగా ఉండనుంది.
వడ్డీ మీద వడ్డీ రూ.2,944 అవుతుంది. అంటే వడ్డీ మీద వడ్డీని మినహాయిస్తే అప్పుడు హోమ్ లోన్ తీసుకున్న వారికి రూ.2,944 మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. రూ. కోటి రుణం తీసుకొని ఉంటే రూ.5,887 ఆదా అవుతుంది. రూ.2 కోట్లు అయితే వడ్డీ మీద వడ్డీ మినహాయింపు వల్ల రూ.11,774 మిగులుతుంది.
అదే క్రెడిట్ కార్డు ఉపయోగించే వారి విషయానికి వస్తే.. కార్డుపై రూ.లక్ష ఔట్‌స్టాండింగ్ అమౌంట్ ఉందని భావిస్తే.. అప్పుడు 2.99 శాతం పడుతుందని భావిస్తే.. అప్పుడు ఆరు నెలల మారటోరియం గడువులో రూ.17,940 వడ్డీ పడుతుంది. అదే వడ్డీ మీద వడ్డీ జత చేస్తే ఇది రూ.19,336కు పెరుగుతుంది. అంటే వడ్డీ మీద వడ్డీ మినహాయిస్తే మీకు రూ.1396 తగ్గుతుంది.