మారనున్న డెబిట్ - క్రెడిట్ కార్డు నిబంధనలు

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:24 IST)
దేశీయంగా డెబిట్, క్రెడిట్ కార్డు నియమనిబంధనలు మారనున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు వీటి నిబంధనలు మార్చనున్నారు. నిజానికి ఈ ఆదేశాలు గత జనవరిలోనే ఆర్బీఐ జారీచేసింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా వీటిని అమలు చేయడంలో ఆలస్యమైంది. ఇపుడు కరోనా శాంతించకపోయినప్పపటికీ... సెప్టెంబరు 30వ తేదీ నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్బీఐ ఆదేసించింది. 
 
ఆర్బీఐ చేసిన మార్పులు చేర్పుల మేరకు.. అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలకు సంబంధించినవిగా ఉన్నాయి. ఈ కొత్త నియమాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ లావాదేవీలు, దేశీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ కార్డులతో లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వాల్సి వుంటుంది. 
 
వీటితో పాటు మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటిఎం మెషిన్ లేదా ఐవిఆర్ ద్వారా ఎప్పుడైనా కార్డు పరిమితిని మార్చవచ్చు. ఈ సౌకర్యం 24 గంటలు ఏడు రోజులు అందుబాటులో ఉంటుంది. అంటే, ఇప్పుడు ఏటీఎం కార్డు లావాదేవీ పరిమితిని మీరే నిర్ణయించుకోగలరు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు