కొత్త బ్రాండు 'డీప్ రూటెడ్ డాట్ కొ’ యొక్క ఆవిష్కరణతో క్లోవర్ డి2సికి వెళుతోంది
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:46 IST)
అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర పరిశ్రమల్లో ఒకటైన క్లోవర్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫారముపై “డీప్ రూటెడ్”గా లభించే వినియోగదారు యాప్‌తో వినియోగదారుకు నేరుగా లభించే తన బ్రాండు అయిన "డీప్ రూటెడ్ డాట్ కొ" ను ఆవిష్కరించింది. డీప్ రూటెడ్ డాట్ కొ అనేది పళ్ళు మరియు కూరగాయల కొరకు నాణ్యత, సుస్థిరత, కనుక్కోగలగడం మరియు అంచనావేయగలగడం యొక్క ఉన్నత స్థాయిపై దృష్టి సారిస్తూ గిరాకీ-వెన్నుదన్ను గల సరఫరా-గొలుసు యొక్క పరిష్కారము.
ఎదుగుతున్న మార్కెట్ అవకాశానికి తగ్గట్టుగా సేవనందిస్తూ, కూరగాయలు మరియు పళ్ళ కొరకు బి2బి మరియు బి2సి విభాగములో దగ్గర దగ్గరగా 100 బిలియన్ డాలర్లకు అంచనాతో, బెంగళూరు మరియు హైదరాబాదుతో మొదలుపెట్టి, డీప్ రూటెడ్ డాట్ కొ బ్రాండు ఎదగడానికి గాను, క్లోవర్ రైతు ఎదుర్కొనే పెట్టుబడి-రాబడి సాంకేతికత రూపకల్పన, సరఫరా గొలుసు మరియు కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యాలు మరియు సమాచార వినిమయములో 2 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి చేస్తుంది.
పళ్ళు మరియు కూరగాయల కొరకు “వినియోగదారు గిరాకీ-ఆధారిత సాగు” ప్రక్రియ ద్వారా పట్టణ ప్రాంతాల, నగరాల యొక్క అవసరాలను తీర్చడంపై డీప్ రూటెడ్ డాట్ కొ దృష్టి సారిస్తుంది. ఈ విభాగములో ప్రస్తుతమున్న వినియోగదారు షాపింగ్ ప్రాధాన్యతను తీర్చడానికి మరియు ఆధునిక మరియు సాధారణ వర్తకము వ్యాప్తంగా ఉనికి కోసం Deep Rooted.Co ఒక “ఓమ్నీ ఛానల్” వ్యూహాన్ని పాటిస్తుంది.
ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, క్లోవర్ యొక్క సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైన అవినాష్ బి.ఆర్ ఇలా అన్నారు “డీప్ రూటెడ్ డాట్ కొ తో, సరఫరా దిశగా మా పూర్తి-దొంతర వ్యవసాయ పరిజ్ఞాన చర్యలచే సానుకూలపరచబడుతూ; మరియు గిరాకీ వైపున వినియోగదారు-అభిముఖమైన యాప్ తో పాటుగా ఒక ఓమ్నీ ఛానల్ ఉనికితో భారతదేశం యొక్క అతిపెద్ద వర్చువల్ రైతుగా ఉండాలనేది మా లక్ష్యము. వినియోగదారులు కాలుష్యరహితమైన, ఉన్నత నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలను అందుకుంటారు, కాగా రైతులు తమ దిగుబడి మరియు రాబడి మెరుగుదలను 3 రెట్ల వరకూ పొందగలుగుతారు.
బి2బి లో ఇదివరకే బెంగళూరు మరియు హైదరాబాదులో సుమారుగా 175కి పైగా స్థానాలలో సుమారుగా 90 మందికి పైగా కస్టమర్లకు ప్రాధాన్యతా సరఫరాదారుగా ఉంటున్న క్లోవర్ యొక్క అనుభవము, కస్టమర్-కేంద్రీకృత బి2సి బ్రాండు ఆవిష్కరణలో అది దూసుకుపోవడానికి వీలు కలిగిస్తుంది. పళ్ళు మరియు కూరగాయల విభాగములో వినియోగదారు రుచులు మరియు ప్రాధాన్యతల్లో విలువైన ప్రథమ అనుభవాన్ని సేకరించుకుంటూనే కంపెనీ తన బి2సి ఆవిష్కరణను తీసుకురావడానికి కోవిడ్-19 లాక్‌డౌన్ దారి చూపింది.
అవినాష్ ఇంకా ఇలా అన్నారు, “వినియోగదారు ప్రవర్తన అనేది పళ్ళు మరియు కూరగాయలను కొనడం కాదు, ఐతే కొరత ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేయడమని గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ లో నిర్వహించిన మా పరిశోధనలో కనుగొనబడింది. వినియోగదారులు నెమ్మదిగా తమ ఇరుగుపొరుగు కిరాణా మరియు ఆధునిక వర్తకపు దుకాణాల్లో కొనే ఆప్షన్ కలిగి ఉండాలనే కోవిడ్-మునుపటి ప్రాధాన్యతలకు తిరిగి వస్తున్నారని మేము గమనించాము. డీప్ రూటెడ్ డాట్ కొ, బెంగళూరు మరియు హైదరాబాదు నగరాల వ్యాప్తంగా తన పంపిణీని ప్రస్తుతమున్న 150 ఆధునిక వర్తక మరియు ఇరుగుపొరుగు దుకాణాల నుండి 500 కు పెంచడానికి మరియు బ్రాండు ఆన్‌లైన్ తో సహా మా వినియోగదారు యాప్ మరియు వెబ్ ఇ-కామర్స్ ఉనికి ద్వారా దూకుడుతో కూడిన గిరాకీని పెంచుకోవడానికి పెట్టుబడి చేస్తుంది.”
ప్రాథమికంగా తన స్వంత గ్రీన్-హౌస్ మరియు హైడ్రోపోనిక్ పొలాలు మరియు 100కు పైగా చిన్న-మధ్యతరహా భూకమతాలు గల రైతుల నెట్‌వర్క్ నుండి ఉన్నత నాణ్యత గల పళ్ళు మరియు కూరగాయలు సరఫరా చేయబడతాయి.
డీప్ రూటెడ్ డాట్ కొ తాజా, శుభ్రత మరియు కమ్యూనిటీ అనే మూడు ముఖ్యమైన స్థంభాలపై నిలబడుతుంది. ఇది, తన ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని తాజాగా మరియు ప్రాథమికంగా నగర ప్రాంతాలకు 150 కిలోమీటర్ల దూరం లోపున పొలాల నుండి సేకరించిన 24 గంటల లోపున అందజేస్తుంది.
అధికంగా చెడిపోగల కూరగాయలు 10 మందికి పైగా వ్యవసాయశాస్త్ర నిపుణుల మార్గదర్శనం క్రింద పండించబడతాయి, వారు రైతులకు “విత్తనం-నుండి-పంటకోత” దశ వరకూ మార్గదర్శనం చేస్తారు. ప్రధానంగా గ్రీన్‌హౌస్ మరియు హైడ్రోపోనిక్ గా పండించబడే ఉత్పాదనలు కలుషిత-రహితంగా ఉంటాయి. స్థానిక సమాజములోనికి వేళ్ళూనుకుపోయిన ఈ బ్రాండు రైతులు మరియు వినియోగదారుల మధ్య సమానత్వ సమతుల్యతను సాధించాలనే దృష్టి సారింపుతో ముందుకువెళుతోంది. రైతులు పంట ఉత్పాదకతను ఒక స్థాయిలో పెంచే సాంకేతిక పరిజ్ఞాన పెట్టుబడులతో మరియు ఆదాయాలను పెంచుకునే అవకాశాన్ని అందించే వినియోగదారు గిరాకీని ప్రాప్యత చేసుకొని లాభపడాల్సి ఉంది మరియు ఉన్నత నాణ్యత గల ఉత్పాదనకు సుస్థిరంగా ప్రాప్యత కలిగి ఉంటూ వినియోగదారు లాభపడాల్సి ఉంది.
ఈ వేడుకలో ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ వాడుకదారులు ఇరువురికీ లభించే వినియోగదారు యాప్ డీప్ రూటెడ్ డాట్ కొ కూడా ఆవిష్కరించబడింది. క్లోవర్ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరు, ఉత్పత్తి మరియు టెక్నాలజీ విధులకు నాయకత్వం కూడా వహిస్తున్న గురురాజ్ రావు గారు ఇలా అన్నారు, “డీప్ రూటెడ్ డాట్ యాప్ మాకు ఒక సహజమైన పురోగతిగా ఉంది. ఈ సంవత్సరం ఆఖరునాటికి 90,000 యాప్ డౌన్‌లోడ్‌లను అధిగమించే దిశగా మేము లక్ష్యం చేసుకున్నాము. షాపింగ్ మరియు క్రమం తప్పని ప్రొమోషన్లతో పాటుగా, మేము కాలం గడిచే కొద్దీ ఉత్పత్తి పోషకత్వం మరియు నిల్వ సలహా, ముఖ్య వ్యవసాయ సాగు పద్ధతులపై సమాచారమును కూడా సమీకృతం చేస్తాము మరియు కనుక్కోగలగడం మరియు పారదర్శకత గురించి మరింత ఎక్కువగా తెలియజేయడానికై పొలం సందర్శన షెడ్యూళ్ళ కొరకు అభ్యర్థనలను కూడా స్వీకరిస్తాము.”