వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు - డొమెస్టిక్ ధర యధాతథం

బుధవారం, 1 జూన్ 2022 (09:56 IST)
కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలను తగ్గించే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, వాణిజ్య సిలిండర్ ధరపై రూ.135 తగ్గించింది. ఇటీవలే వాణిజ్య సిలిండర్‌పై రూ.200 మేరకు ధరను తగ్గించిన విషయం తెల్సిందే.
 
ఇపుడు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల సమీక్షలో భాగంగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.135 మేరకు తగ్గించింది. దీంతో ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2219కు, కోల్‌కతాలో రూ.2322గాను, ముంబైలో రూ.2171.50గాను, చెన్నైలో రూ.2373గా ఉంది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు