పండుగల సీజన్ ఆరంభమైంది. మహమ్మారి ఇండియాలో ప్రవేశించిన తరువాత కాస్త ఉత్సాహంగా వేడుకలు జరుపుకునేందుకు అనువుగా ఈ సీజన్ కనిపిస్తుంది. వినాయకచవితి సందడిగా జరుపుకున్న ఉత్సాహవంతులు ఇప్పుడు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు సిద్ధమవుతున్నారు. ఈ ఉత్సాహం సంక్రాంతి వరకూ కొనసాగుతుందన్నది తెలిసిందే.
ఇండియాలో పండుగ ఏదైనా పిండివంటలు ఉండాల్సిందే. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? తెలంగాణాలో బతుకమ్మ, దసరా వేడుకలు కలిసి రావడంతో పది రోజుల పాటు ప్రతి ఇంటా సందడి కనిపిస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పిండివంటలు కనిపించని ఇల్లే ఉండదు. బూరెలు, కజ్జికాయలు, మురుకులు... చెబితే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. అమ్మమ్మల కాలం నాటి వంటకాలకు సమకాలీన రుచులను జోడించి ప్రయోగాలు చేసే ఔత్సాహిక పాకశాస్త్ర నిపుణులూ కనిపిస్తున్నారిప్పుడు.
న్యూక్లియర్ ఫ్యామిలీల కాలంలో, కరోనా తీసుకువచ్చిన నూతన సాధారణతలో ఎవరింట్లో వాళ్లు ఈ పిండివంటలు చేసుకోడానికీ ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా యూట్యూబ్ చెఫ్‌లు ఎలా వండాలో చెబుతుంటే, ఆ ప్రయత్నంలో ఉన్న ఇల్లాలికి సహాయపడుతూ బంధాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళ్తున్న మగమహారాజులూ ఉన్నారు.
ఈ పండుగ సీజన్‌లోని మధురస్మృతులను కలకాలం పదిలంగా పరుచుకోవడానికీ తమ వంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. కానీ ఆ స్మృతి, శృతి చెడకుండా ఉండాలంటే పిండివంటలలో ఉపయోగించే నూనె కూడా అంతే చక్కనిదై ఉండాలి. స్వచ్ఛమైన నూనె కావడంతో పాటుగా ప్రపంచ శ్రేణి నాణ్యత కలిగిన గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ లాంటి నూనెలు కుటుంబ ఆరోగ్యానికీ భరోసానందిస్తాయి.
గోల్డ్ డ్రాప్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ప్రపంచ శ్రేణి ప్రీమియం సూపర్ రిఫైన్డ్ ఆయిల్. అత్యున్నత స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలిచే గోల్డ్ డ్రాప్ నూనెతో తయారుచేసిన పిండివంటలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అద్భుతమైన రుచినీ అందిస్తాయి. స్వచ్ఛతకు అభయం, నాణ్యతలో స్ధిరత్వం అనే గోల్డ్‌డ్రాప్ వాగ్ధానానికి అనుగుణంగా నూనె ఉంటుంది. తేలికైన ఈ నూనె, అంతే స్వచ్ఛగా ఉంటుంది. పైగా, ఈ నూనె వాసన కూడా ఉండదు.
మితేష్ లోహియా, డైరెక్టర్-సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ, అత్యుత్తమ ముడి పదార్థాలను సేకరించడంతో పాటుగా అలా్ట్ర మోడ్రన్ రిఫైనింగ్ సదుపాయాలతో ప్రతి చుక్కలోనూ నాణ్యతను అందిస్తుంది. మా ప్యాక్‌లు కల్తీ జరగడానికి అవకాశం లేనివి మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అని అన్నారు.