ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధాన గడువు పెంపు..జూన్ 30లోగా..?

గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:31 IST)
ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధాన గడువు మార్చి 31వ తేదీతో ముగిసిన తరుణంలో.. డిస్‌మ్యాచ్, వెబ్ సైట్ మొరాయించడం వంటి ఇతరత్రా కారణాల ద్వారా చాలామంది ఆధార్‌తో పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోలేకపోయారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధాన గడువును మరోసారి పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.
 
కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మార్చి 31 వరకూ ఉన్న ఈ గడువును పెంచాలని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖను కోరారు. దీంతోపాటు, చివరి నిమిషంలో ఎదురైన ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వంప్రత్యక్ష పన్నుల వివాదాలకు సంబంధించి 'వివాద్‌ సే విశ్వాస్‌' గడువు బుధవారంతో ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది.
 
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు 2021 ద్వారా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారికి రూ.1000 జరిమానా విధించేలా కొత్త రూల్ తీసుకువచ్చింది. ఫైనాన్స్ బిల్లు కొత్తగా ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 234 హెచ్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా పెనాల్టీ విధిస్తారు. అందువల్ల పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారు ఉంటే జూన్ 30లోగా రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పాన్ ఆధార్ లింక్ గడువును గతంలో చాలా సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు