విజయవాడలో శాటిలైట్ ల్యాబొరేటరీని ప్రారంభించిన లుపిన్ డయాగ్నోస్టిక్స్

గురువారం, 25 మే 2023 (15:10 IST)
అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని ఈరోజు ప్రారంభించినట్లు వెల్లడించింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్‌ను పెంచడం లక్ష్యంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ చేస్తున్న విస్తరణలో ఇది ఒక భాగం. కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ భారతదేశం అంతటా లుపిన్‌కు ఉన్న 27 లేబరేటరీ, 410కి పైగా సేకరణ కేంద్రాలతో కూడిన లుపిన్ డయాగ్నోస్టిక్స్ విస్తృత నెట్‌వర్క్‌ను సంపూర్ణం చేస్తుంది. ఈ విస్తరణ సమగ్ర రోగనిర్థారణ పరిష్కారాలను అందించడానికి, రోగనిర్ధారణ పరిశ్రమలో దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి లుపిన్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.
 
విజయవాడలోని లుపిన్ యొక్క కొత్త ల్యాబొరేటరీ అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతికతను కలిగి ఉంది. అత్యున్నత అర్హతలు కలిగిన వైద్య నిపుణుల బృందంతో కూడిన సిబ్బందిని కలిగి ఉంది. ఈ అధునాతన మౌలిక సదుపాయాలు స్థానిక కమ్యూనిటీకి నమ్మకమైన, అధిక-నాణ్యత డయాగ్నస్టిక్ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్‌కు తగిన శక్తిని ఇస్థాయి. అత్యాధునిక సాంకేతికత, నైపుణ్యంల సమ్మేళనం, ఖచ్చితమైన మరియు సమర్థవంతమైన పరీక్షను నిర్ధారిస్తుంది. సకాలంలో రోగ నిర్ధారణ, మెరుగైన రోగి సంరక్షణకు సైతం అనుమతిస్తుంది. సాధారణ మరియు ప్రత్యేక పరీక్షలతో పాటు, విజయవాడలో కొత్తగా ప్రారంభించబడిన ల్యాబొరేటరీ విస్తృతమైన రోగనిర్ధారణ సేవలను అందిస్తుంది. వీటిలో క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, హెమటాలజీ, బయోకెమిస్ట్రీ, సెరాలజీ మరియు ఇమ్యునాలజీ ఉన్నాయి.
 
నేటి ఆరోగ్య సంరక్షణ వాతావరణంలో, తగిన ఋజువులతో కూడిన చికిత్స ప్రమాణంగా మారింది, రోగనిర్ధారణ పరీక్షలు దాదాపు 70% చికిత్స నిర్ణయాలలో కీలకంగా పనిచేస్తున్నాయి. లుపిన్ డయాగ్నోస్టిక్స్ కఠినమైన నాణ్యత నియంత్రణ మార్గదర్శకాలు అనుసరించడం ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఉష్ణోగ్రత-నియంత్రిత నమూనా కదలికలతో ప్రతి నమూనా యొక్క సమగ్రత మరియు నాణ్యతను స్థిరంగా నిర్ధారిస్తుంది. శక్తివంతమైన హోమ్ కలెక్షన్ సర్వీస్ టీమ్ మరియు నెట్‌వర్క్‌తో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ రోగి సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. ఒక బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా కేటాయించిన phlebotomists ట్రాకింగ్‌ను సైతం చేయవచ్చు. కంపెనీ ఇప్పుడు రోగుల కోసం డైనమిక్ స్మార్ట్ నివేదికలు జోడించటం, హిస్టోరికల్ ట్రెండ్ గ్రాఫ్‌లను చేర్చడం మరియు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి తగిన చిట్కాలను సైతం అందించటం ద్వారా తమ విలువ-ఆధారిత సేవలను కూడా మెరుగుపరిచింది.
 
"వ్యాధుల నిర్వహణ మరియు తగిన చికిత్సను గుర్తించడంలో ఖచ్చితమైన రోగ నిర్ధారణ తొలి అడుగుగా నిలుస్తుంది" అని లుపిన్ డయాగ్నోస్టిక్స్ సిఈఓ రవీంద్ర కుమార్ అన్నారు. "మా అత్యాధునిక సాంకేతికత మరియు వ్యక్తిగతీకరించిన స్మార్ట్ నివేదికలతో, రోగులు మరియు వైద్యులు ఆరోగ్య ధోరణులపై విలువైన పరిజ్ఞానం పొందుతారు, మరియు పూర్తి సమాచారంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలరు. నాణ్యమైన డయాగ్నస్టిక్‌ సేవలను సరసమైన ధరలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం" అని అన్నారాయన.
 
వైద్యులు, రోగులు మరియు వినియోగదారులకు అసమానమైన రోగనిర్ధారణ సేవలను అందించడానికి  లుపిన్ డయాగ్నోస్టిక్స్ అంకితం చేయబడింది. నాణ్యత మరియు ఖచ్చితత్వం పట్ల తమ స్థిరమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ, లుపిన్ యొక్క నాలుగు ప్రయోగశాలలు ఇప్పటికే NABL గుర్తింపును పొందాయి. ఈ విజయం నమ్మకమైన నాయకునిగా శ్రేష్ఠతకు ప్రాధాన్యతనివ్వడంలో లుపిన్ డయాగ్నోస్టిక్స్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు