హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్...

ఆదివారం, 21 మే 2023 (18:36 IST)
విజయవాడ పరిధిలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మసాజ్ సెంటర్ల (స్పా కేంద్రాలు)పై శనివారం పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా తన ఇంట్లోనే మసాజ్ సెంటర్ నడుపుతూ పట్టుబడ్డారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... మునిసిపాలిటీ పరిధిలో తాడిగడప 100 అడుగుల రోడ్డులో మసాజ్ కేంద్రం, ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా శ్రీనివాస నగర్ కాలనీలో పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కిషోర్ అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఒక కేంద్రం, పోరంకిలో మరో మసాజ్ కేంద్రాన్ని నడుపుతూ వచ్చారు. 
 
ఈ కేంద్రాల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుకుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ కేంద్రాలపై నిఘా ఉంచిన పోలీసులు.. ఆకస్మికంగా దాడులు చేసి.. అనేక మందిని అరెస్టు చేశారు. వీరిలో 12 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. కిషోర్‌పై జిల్లా ఎస్పీ జాషువా విచారణకు ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు