'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. వాన్నా క్రై రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసి, కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది.