సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ అబుదాబి, సంస్కృతి పట్ల అబుదాబికి ఉన్న నిబద్ధత

ఐవీఆర్

గురువారం, 23 మే 2024 (22:18 IST)
అబుదాబి (డిసిటి అబుదాబి) సాంస్కృతిక, పర్యాటక శాఖ ఈ రోజు సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్, దాని సాంస్కృతిక సంస్థలతో పాటు, 2025లో పూర్తి కానుందని పునరుద్ఘాటించింది. ప్రపంచ వేదిక, సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్. ఇది మహోన్నత సాంస్కృతిక వారసత్వం నుండి ఉద్భవించింది, సంప్రదాయాలను వేడుక చేసుకుంటుంది, మహోన్నతమైన సంస్కృతిని అభివృద్ధి చేస్తుంది. ఇది సాధికారత యొక్క స్వరూపం, విభిన్న ప్రపంచ సంస్కృతులను ప్రచారం చేస్తూ ఈ ప్రాంతం యొక్క వారసత్వాన్ని జరుపుకునే మ్యూజియంలు, కలెక్షన్లు, కథనాలను ప్రదర్శిస్తుంది.
 
ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత, సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ సంస్థల వైవిధ్యం డిస్ట్రిక్ట్‌ను అత్యంత ప్రత్యేకమైన సాంస్కృతిక వేదికలలో ఒకటిగా మారుస్తుంది. ఇది ఇప్పటికే లౌవ్రే అబుదాబికి నిలయంగా ఉంది. అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి సార్వత్రిక మ్యూజియం ఇది. విభిన్న సంస్కృతులకు చెందిన కళాఖండాలను ప్రక్క ప్రక్కన ప్రదర్శిస్తుంది, మానవ సంబంధాల కథను చెబుతుంది. 2017లో ప్రారంభమైనప్పటి నుండి, లౌవ్రే అబుదాబి 5 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించింది. దాని ఉత్కంఠభరితమైన నిర్మాణ శైలి, దాని వినూత్న కథనానికి గుర్తింపు పొందింది. దీనికి సమీపంలో, బెర్క్లీ అబుదాబి సంవత్సరం పొడవునా సంగీతం, ప్రదర్శన కళలు, విద్యా కార్యక్రమాలను అందిస్తుంది.
 
అదనంగా, మనరత్ అల్ సాదియత్ సృజనాత్మక కళల వ్యక్తీకరణకు కేంద్రంగా పనిచేస్తుంది. అబుదాబి యొక్క సాంస్కృతిక క్యాలెండర్‌: అబుదాబి ఆర్ట్ అండ్ కల్చర్ సమ్మిట్ అబుదాబిలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు నిలయంగా ఉంది. సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్‌లో త్వరలో తెరవబోయే సంస్థల ప్రస్తుత నిర్మాణ పురోగతి 76% వద్ద ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయ మ్యూజియం, జయెద్ నేషనల్ మ్యూజియం, దేశం యొక్క గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని వేడుక జరుపుకుంటుంది, అలాగే దేశ వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసత్వాన్ని గౌరవిస్తుంది. అదనంగా, టీమ్‌ల్యాబ్ ఫెనోమేనా అబుదాబి సందర్శకులను వారి ఊహల పరిమితులను అధిగమించే, ఎప్పటికప్పుడు మారుతున్న అన్వేషణకు ఆహ్వానిస్తుంది.
 
ఇది నేచురల్ హిస్టరీ మ్యూజియం అబుదాబితో జతచేయబడుతుంది, ఇది మన విశ్వం, మన గ్రహం యొక్క కథ ద్వారా 13.8 బిలియన్ సంవత్సరాల ప్రయాణంలోకి సందర్శకులను తీసుకెళ్లే పరిశోధన, బోధనా సంస్థను కలిగి ఉంటుంది. గుగ్గెన్‌హీమ్ అబుదాబి 1960ల నుండి ఇప్పటివరకు కళను వేడుక జరుపుకునే మ్యూజియం ఇది మన కాలంలోని అత్యంత ముఖ్యమైన కళాత్మక విజయాలను అందిస్తుంది. 
 
సాంస్కృతిక ఎజెండాను నిర్వచించిన, పురావస్తు త్రవ్వకాలు, అన్వేషణల ద్వారా ప్రపంచానికి యుఏఈ చరిత్రను తెలిపిన దివంగత షేక్ జయెద్ వారసత్వానికి సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ నివాళులర్పిస్తుంది. యుఏఈలో మొట్ట మొదటి మ్యూజియం అల్ ఐన్ మ్యూజియం స్థాపనతో ఈ వారసత్వం ప్రారంభమైంది, ఇది 1971లో ప్రారంభించబడింది. దీనిని అనుసరించి 1981లో కల్చరల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది. దివంగత షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ నహ్యాన్ మార్గదర్శకత్వంలో షేక్ జయెద్ వారసత్వం అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు HH షేక్ మొహమ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ HH షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జయెద్ ఆ వారసత్వాన్ని నిర్మించడం కొనసాగిస్తున్నారు.
 
డిసిటి అబుదాబి ఛైర్మన్, HE మొహమ్మద్ అల్ ముబారక్ మాట్లాడుతూ, “సంస్కృతి అనేది కేవలం సంబంధాలకు అతీతం; అది మన పరిణామానికి ఆకృతి అందిస్తుంది. మన ఆలోచనలను విస్తృతం చేస్తుంది. ఇక్కడ అబుదాబిలో, మేము ఈ ప్రభావాన్ని స్వీకరించాము, సమాజం అంతటా ప్రతిధ్వనించే లోతైన ప్రశంసలను పెంపొందించాము. సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ 'సాంస్కృతిక ఆశ'ని ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక వైవిధ్యం యొక్క సందేశాన్ని డిస్ట్రిక్ట్ అందజేస్తుంది, అది కాలక్రమేణా మరింత శక్తివంతం అవుతుంది, ప్రపంచ సంబంధాలను సృష్టిస్తుంది. సాంస్కృతిక మార్పిడిని ప్రేరేపిస్తుంది. ఈ ప్రాంతం, గ్లోబల్ సౌత్‌, ప్రపంచానికి మద్దతుగా కొత్త ఆలోచనా విధానాలను పెంపొందించడం చేస్తుంది. ప్రజలు గతం నుండి నేర్చుకోవడానికి, మన వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి, మన భవిష్యత్తుపై దృష్టి పెట్టడానికి అనువైన ఒక ప్రదేశం, సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్" అని అన్నారు.
 
వారసత్వ సంపదను సంరక్షించడంలో, అలాగే భవిష్యత్ దృక్పథాన్ని స్వీకరించడంలో అబుదాబి యొక్క నిబద్ధతకు నిదర్శనం, సాదియత్ కల్చరల్ డిస్ట్రిక్ట్. విభిన్న సంస్కృతులతో మమేకమవటానికి, సంభాషణ మరియు మార్పిడిని పెంపొందించడానికి ప్రపంచాన్ని డిస్ట్రిక్ట్ ఆహ్వానిస్తుంది. ఈ ప్రాంతంతో పాటుగా గ్లోబల్ సౌత్‌ను శక్తివంతం చేసే ప్రపంచ సాంస్కృతిక ప్రాంగణాన్ని అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు