వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు.. ఎస్‌బీఐ గుడ్ న్యూస్
శనివారం, 2 జులై 2022 (22:11 IST)
దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి. త్వరలో వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది.
జులై1న జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ శుక్రవారం దినేష్ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్‌బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలు ఉంటాయని అన్నారు.
ఎస్‌బీఐ ఇప్పటికే క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్ సమరి, రివార్డ్ పాయింట్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ వంటి వివరాల్ని వాట్సాప్‌లో పొందవచ్చు.