ఆల్ టైం హైగా పెరిగిన బంగారం ధరలు...

ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:03 IST)
కొద్ది రోజులుగా బంగారం ధరలు షాకిస్తున్నాయి. అప్పుడప్పుడు తగ్గినట్లు కనిపించినా భారీగా పెరుగుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం గోల్డ్ రేట్లు రికార్డు గరిష్ఠ స్థాయికి చేరాయి. 
 
తులం రేటు ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.750 మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా ధరల పెరుగుదల ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
 
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2072 డాలర్ల వద్దకు చేరింది. ఇది ఆల్ టైం హైగా చెప్పవచ్చు. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు