భారత్‌లో ఉద్యోగులపై వేటు.. 600మందిని తొలగించిన ఉబెర్

మంగళవారం, 26 మే 2020 (12:11 IST)
Uber
ప్రపంచవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులను తొలగిస్తున్న మే మొదటి వారంలో ఉబెర్ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా పలు సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఓలా కూడా 1,400 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఉబెర్ ఇండియా భారత్‌లో ఉద్యోగులపై వేటు వేసింది. కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంలో ఉబెర్ 600 మందిని తొలగించింది. డ్రైవర్, రైడర్ సపోర్ట్, ఇతర డివిజన్లలో భారతదేశంలో దాదాపు 600 మందిని తొలగిస్తున్నట్టు ఉబెర్ ఇండియా, దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ తెలిపారు. 
 
అలాగే ప్రతి ఒక్కరికి కనీసం 10 వారాల చెల్లింపు, రాబోయే ఆరు నెలలకు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్, అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్, ల్యాప్‌టాప్‌ల వాడకానికి అనుమతినిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కోవిడ్-19 ప్రభావం, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు