ఆర్థిక మాద్యంలోకి అమెరికా.. భారత్‌కు కష్టాలు తప్పవు

శనివారం, 7 అక్టోబరు 2023 (13:33 IST)
అమెరికా తీవ్ర ఆర్థిక మాద్యంలోకి జారుకోబోతుందనే షాకింగ్ వార్త భారత్‌ను కలచివేస్తోంది. ఇది ఇండియన్ జీడీపీలో ప్రధాన భాగమైన సర్వీస్ సెక్టార్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. ఇండియన్ టాప్ ఎకనామిస్టుల్లో ఒకరైన యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా హెచ్చరించారు. 
 
ఇండియన్ బాండ్, ఈక్విటీ మార్కెట్లపై యూఎస్ రెసిషన్ పెను ప్రభావాన్ని చూపుతుందని.. దీని ప్రభావం కారణంగా ఇండియాతో పాటు ఇతర దేశాలకు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. 
 
ఈ ఏడాదే అమెరికా ఆర్థికమాంద్యంలోకి జారుకోబోతోందని నీలకంఠ్ మిశ్రా తెలిపారు. ఒకవేళ ఆర్థికమాంద్యం తప్పని పరిస్థితుల్లో, దాని ప్రభావం నుంచి ఇండియా బయట పడాలంటే, మాక్రోఎకనామిక్ స్థిరత్వంపై దృష్టిసారించాలని మిశ్రా సూచించారు.

వెబ్దునియా పై చదవండి