తాను రుణాలను ఎగవేసే వ్యక్తిని కాదన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ.. బ్యాంకుల నుంచి రుణాలు పొంది పారిపోయానని సోషల్ మీడియా, మీడియా కోడైకూస్తోంది. దీనిపై విజయ్ మాల్యా మండిపడ్డారు. కోర్టులో తాను రుణం చెల్లించేందుకు సిద్ధంగా వున్న విషయాన్ని మీడియా ఎందుకు ఫోకస్ చేయలేదని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తే ఆయనను ఉంచేందుకు జైలు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. మాల్యాను భారత్‌కు తరలిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నెంబర్ 12 బ్యారెక్‌లో ఉంచనున్నారు. ఇందులో కొన్ని సదుపాయాల్ని సీబీఐ అధికారులు వీడియోలు తీసి గతంలోనే లండన్ కోర్టుకు జైలు అధికారులు పంపించారు.
విజయ్ మాల్యాను ఉంచనున్న సెల్‌లో ఎల్సీడీ టీవీ, మెత్తటి పరుపు, దిండు, దుప్పట్లు ఏర్పాట్లు చేశారు. టీవీలో ఇంగ్లీష్, మరాఠీ ఛానెల్స్ వచ్చే ఏర్పాటు చేశారు. మాల్యాను ఉంచనున్న జైలుగదిలో అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉందని జైలు అధికారులు వీడియోలో తెలిపారు.