ఇంగ్లీష్ అర్థం కాని పోలీసులు ఎంత పనిచేశారో తెలుసా?

మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:08 IST)
ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో పోలీసులు అయోమయానికి గురయ్యారు. వీరి చర్య వల్ల ఓ వ్యక్తి జైలులో మగ్గిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాకి చెందిన వ్యాపారి నీరజ్‌‌కుమార్‌పై ఆయన భార్య రెండుసార్లు వరకట్న వేధింపుల కేసు నమోదైంది. తన భార్యతో మనస్పర్ధల కారణంగా ఆయన 2014లో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం వారెంట్ అనే పేరిట ఆదేశాలు జారీ చేసింది. దీనిని  పోలీసులు అరెస్ట్ వారెంట్ అనుకుని నీరజ్ కుమార్‌ను నవంబర్ 25న అరెస్ట్ చేసి రాత్రంతా జైలులో ఉంచారు. నిజానికి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు. అసెట్ వారెంట్ ఇచ్చింది.
 
నీరజ్ తన భార్యకు భరణం చెల్లించనందున అతడి ఆస్తులు, ఆర్థిక వివరాలకు సంబంధించిన పత్రాలు న్యాయస్థానికి సమర్పించాలని చెప్పింది. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న పోలీసులు నీరజ్‌ను జైలుకు తరలించారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు