హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్‌ను ప్రారంభించిన వోక్స్‌వ్యాగన్‌

మంగళవారం, 1 డిశెంబరు 2020 (17:55 IST)
వోక్స్‌వ్యాగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా నేడు నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్‌ను హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద ప్రారంభించినట్లు వెల్లడించింది. జ్యోతినగర్‌లో 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, నూతన 3ఎస్‌ సదుపాయాలతో మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ నీహార్‌ మోదీ నాయకత్వంలో నిర్వహించబడుతుంది.
 
ఈ నూతన సదుపాయంలో 3 కార్లు డిస్‌ప్లే ఉండటంతో పాటుగా తాజా ఉత్పత్తి ఆఫరింగ్‌ను వినియోగదారులకు నూతన మరియు వినియోగించిన కార్ల విభాగం (డీడబ్ల్యుఏ)లో అందిస్తుంది. ఇది విస్తృతశ్రేణిలో అమ్మకం తరువాత సేవలను సైతం అందించడంతో పాటుగా నిర్వహణ మరియు విడిభాగాలను సైతం అందిస్తుంది. అలాగే అత్యంత నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల తోడ్పాటుతో వినియోగదారులకు సౌకర్యం అందిస్తూ మరమ్మత్తులను సైతం చేస్తుంది.
 
ఈ నూతన సదుపాయం తెరువడం గురించి శ్రీ అశీష్‌ గుప్తా, బ్రాండ్‌ హెడ్- వోక్స్‌ వ్యాగన్‌ పాసెంజర్‌ కార్స్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లోని మెహదీపట్నం వద్ద నూతన సదుపాయాన్ని  ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా కస్టమర్‌ టచ్‌ పాయింట్లను విస్తరించాలనే వోక్స్‌వ్యాగన్‌ సరైన దిశలో వెళ్తుంది. వచ్చే సంవత్సరం టైగున్‌ను ఆవిష్కరించడానికి మేము సిద్ధమైన వేళ, మేము అవిశ్రాంతంగా మా వినియోగదారులను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాము. ప్రీమియం అనుకూలమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడం ద్వారా ఇది చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అత్యద్భుతమైన అమ్మకాలు మరియు సేవల అనుభవాలను దక్షిణ భారతదేశంలోని మా వినియోగదారులకు అందించగలమనే నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.
 
నూతన కస్టమర్‌ టచ్‌ పాయింట్‌ ఆవిష్కరణ గురించి శ్రీ నిహార్‌ మోదీ,డైరెక్టర్‌, మోదీ ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మా నెట్‌వర్క్‌కు వోక్స్‌వ్యాగన్‌ మెహదీపట్నం టచ్‌పాయింట్‌ జోడింపుతో మేము మా వినియోగదారులకు మరింత చేరువయ్యాం. మా అత్యాధునిక, సమగ్రమైన సేల్స్‌ మరియు సర్వీస్‌ సదుపాయాలు మా వినియోగదారులు ప్రొఫెషనల్‌ సేల్స్‌ మరియు నిర్వహణ సేవల అనుభవాలను తమ సౌకర్యానికి అనుగుణంగా పొందగలరు’’ అని అన్నారు.
 
వోక్స్‌వ్యాగన్‌ ఇండియాకు 137 సేల్స్‌ మరియు116 సర్వీస్‌ టచ్‌ పాయింట్లు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి మరియు ఈ సంవత్సరాంతానికి 150 సేల్స్‌ ఔట్‌లెట్లకు ఇది చేరుకోవాలని ప్రణాళిక చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు