జొమాటోపై పలు ఆరోపణలు చేస్తూ కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా బీఫ్, పోర్క్ వంటి వంటకాలను సప్లై చేయిస్తున్నారని నిరసనకు దిగారు. జొమాటో మా మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని డెలివరీ బాయ్స్ మండిపడుతున్నారు. ఇకనైనా బీఫ్, పోర్క్ డెలివరీ సర్వీస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జొమాటో మా సెంటిమెంట్స్‌తో ఆడుకుంటోంది. మా చేత అన్నిరకాల ఫుడ్స్ డెలివరీ చేయిస్తోంది. హిందువులమైన మా చేత బీఫ్ డెలివరీ చేయిస్తున్న జొమాటో.. భవిష్యత్‌లో ముస్లిం సోదరుల చేత పోర్క్‌ను కూడా డెలివరీ చేయిస్తుంది. కాబట్టి మతపరమైన విశ్వాసాలతో జొమాటో ఆటలాడవద్దు. అలాగే డెలివరీ బాయ్స్ వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నామని కోల్‌కతా డెలివరీ బాయ్స్ నిరసనకు దిగారు.