మమతా బెనర్జీది హిరణ్యకశ్యపు కుటుంబమా? : సాక్షి మహరాజ్

సోమవారం, 3 జూన్ 2019 (14:19 IST)
వెస్ట్ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమెది రాక్షసకుటుంబం అని ఆరోపించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వారిపై బెంగాల్ సర్కారు ఉక్కుపాదం మోపారనే విమర్శలు వచ్చాయి. పలు ప్రాంతాల్లో టీఎంసీ - బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. 
 
ఈ పరిణామాలపై బీజేపీ ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ స్పందిస్తూ, బెంగాల్ రాష్ట్రంలో జై శ్రీరాం అన్నవారిపై ఆగ్రహిస్తున్నారనీ, మమతా బెనర్జీ హిరణ్యకశ్యపుడు కుటుంబానికి చెందిన వారన్నారు. 
 
కృత యుగంలో ఓ రాక్షసుడు ఉండేవాడని.. అతడి పేరు హిరణ్యకశ్యపుడని.. విష్ణుమూర్తిని కొలిచినందుకు తన కుమారుడైన ప్రహ్లాదుడినే జైల్లో బంధించాడని అన్నారు. బెంగాల్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయని.. దీన్ని బట్టి చూస్తే మమతా బెనర్జీ ఆ రాక్షసుడి కుటుంబానికి చెందిన వారిలా అనిపిస్తోందని సాక్షి మహరాజ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు