మూడు లేదా ఆరు నెలలకు ఓసారి.. పిల్లలతో కలిసి అలా?

ఆదివారం, 30 డిశెంబరు 2018 (16:23 IST)
పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. అతిగా టి.వీలను చూడనీయకూడదు. ఎదిగే పిల్లలపై టి.వీ. ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇది మంచిది కాదు. రాత్రి 9 గంటల లోపుగా పిల్లలను నిద్రపుచ్చండి. చక్కటి నిద్రవారి బుద్ధి ఎదగడానికి సహకరిస్తుంది. 
 
టీవీలను అతిగా చూస్తే.. బుద్ధి వికాసం వుండదని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల్ని మెదడుపై ప్రభావం చూపుతుందని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఏదేమైనా సూర్యోదయం ముందుగానే నిద్రలేపాలి. చెడు స్నేహాలు ఏర్పడకుండా మీ పిల్లలను గమనిస్తూ ఉండాలి. వారానికి ఒక్కరోజు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి లేదా సినిమాకు వెళ్ళాలి. 
 
మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి కుటుంబమంతా కలిసి ఒక విహార యాత్రకు వెళ్ళాలి. విజ్ఞానమును భోదించే విహారయాత్ర అయితే ఇంకా మంచిది. ఉదయం, రాత్రి తప్పనిసరిగా దంతాలను శుభ్రం చేసుకునేలా అలవాటు చేయించాలి. దంత సమస్యలుండవు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు