పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. ఇందులోని ప్రోటీనులు, క్యాల్షియం దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. లినోలియిక్ ఆసిడ్ బరువును నియంత్రించడంలో సహాయ పడుతుంది.
ఇక గోధుమలతో చేసే చపాతీలను తినడం ద్వారా కూడా బరువు సులభంగా తగ్గొచ్చు. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్, క్లోరిన్, సిలికాన్, జింక్, కాపర్, విటమిన్ బి, ఇలు పుష్కలంగా ఉన్నాయి.
ఉడికించిన ఆలు ముద్ద - ఒక కప్పు
కొత్తిమీర తరుగు- అర కప్పు
పచ్చిమిర్చి పేస్టు - ఒక స్పూన్
ముందుగా వెడల్పాటి బౌల్‌లో గోధుమ పిండి, మైదా, పనీర్ తురుము, ఆలు ముద్ద, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, జీలకర్రపొడి అన్నీ వేసి బాగా కలుపుకోపాలి. చపాతీ పిండిలా సిద్ధం చేసుకుని పక్కన బెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకుని పెనంపై వేయాలి. నెయ్యి వేసుకుంటూ రెండువైపులా దోరగా కార్చుకుని మష్రూమ్ మసాలా, చికెన్ గ్రేవీలతో బ్రేక్ ఫాస్ట్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!