కుక్కర్‌‌తో వంట చేస్తుంటే ఇవి తప్పక తెలుసుకోవాలి...

గురువారం, 23 ఆగస్టు 2018 (16:45 IST)
కుక్కర్‌లో కొలత ప్రకారం నీటిని పోసుకోవాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చుకోవాలి. పాత్రలు ఒరిగితే అందులోని పదార్థాలు కుక్కర్‌లో పడిపోతాయి. కుక్కర్‌ నీటితో ఉడకడం వలన కుక్కర్‌‌లో నీరు ఇంకిపోయి సేఫ్టీవాల్వ్ బద్దలవడం, వెయిట్ ఎగిరిపోయి కుక్కర్‌లో పదార్థాలు పైకి పడడం వంటివి జరుగుతాయి.
 
గాస్కెట్ పాడయిపోతే కుక్కర్ పక్కల నుండి ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అందువలన లోపలి పదార్థాలు ఉడకకపోగా ఎంతసేపటికి విజిల్ రాదు. కుక్కర్‌లో పెట్టిన గిన్నెలలో ఆహార పదార్థాలను, బియ్యాన్ని పెట్టినప్పుడు ఆ పాత్రలో నీటిని అవి ఉడికేందుకు సరిపడా పోయాలి. చిన్న గిన్నెలలో ఎక్కువ పదార్థాలను పెట్టడం వలన అవి సరిగ్గా ఉడకవు లేదా పొంగి కుక్కర్‌లో పడిపోతాయి. 
 
కుక్కర్ మూతకున్న రంధ్రం లోపలి నుంచి ఆవిరి బయటకు వస్తున్నప్పుడు వెయిట్‌ని పెట్టాలి. మూతకున్న ఆవిరి రంధ్రం మూసుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. కుక్కర్‌లో లోంచి ఆవిరి త్వరగా రావడానికి, లోపలి పదార్థాలు ఉడకడానికి హెచ్చు మంటను పెట్టుకోవాలి. వెయిట్ పెట్టిన తరువాత కూడా మంటను తగ్గించకూడదు. 
 
కుక్కర్‌ను దింపిన తరువాత మంటను తగ్గించి ఆ తరువాత స్టౌను ఆర్పాలి. కుక్కర్‌ను దింపిన తరువాత వెంటనే మూత తీయకూడదు. ఒకవేళ తీస్తే దాని వలన గ్యాస్‌‌కట్ దెబ్బతింటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు