కోవిడ్‌తో అష్టకష్టాలు పడుతున్న మహిళ.. 22 గంటలు మంచంపైనే..?

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:37 IST)
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది ప్రజలు దాని బారిన పడ్డారు. తాజాగా ట్రేసీ థాంప్సన్ అనే మహిళ చాలా కాలంగా కోవిడ్‌తో పోరాడుతోంది. ట్రేసీ కెనడా నివాసి. ఆమె కూడా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీంతో తన పొదుపు మొత్తం అయిపోయిందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
2020లో మొదటిసారిగా ట్రేసీ థాంప్సన్‌ను ఈ కరోనావైరస్ సోకింది. అప్పటి నుంచి ఆమె ఒక్కరోజు కూడా పని చేయలేకపోయింది. 22 గంటలు మంచం మీద ఉంటుంది. ఆమెలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా గొంతు నొప్పి వచ్చింది. రుచిచూడలేక.. వాసనను గ్రహించలేకపోయింది. 
 
కొద్దికొద్దిగా ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా క్షీణించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెను తిరిగి ఇంటికి పంపించారు. ప్రొఫెషనల్ చెఫ్ ట్రేసీ థాంప్సన్ ఇప్పుడు ఎక్కువగా రకరకాల మందులు, షేక్‌లు తీసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు