యుకే నుండి ఢిల్లీ మీదుగా చెన్నైకి తిరిగి వచ్చిన ఒక ప్రయాణీకుడుకి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది కరోనా వైరస్ కొత్త జాతా కాదా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అతని నమూనాలను పూణేకి పంపించారు. ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులను యుకె నుండి తిరిగి వచ్చిన వారిగా గుర్తించి వారిని పర్యవేక్షిస్తున్నారు. యుకె నుండి అన్ని విమానాలను భారత్ నిషేధించింది.