తెలంగాణలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 2,273 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,61,844కు చేరుకోగా.. 956 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు 21.69 లక్షల మందికి అధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు.
అయితే.. గత 24 గంటల్లో కొత్తగా.. 90,123 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా మంగళవారం 1,290 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కి పెరగగా.. మరణాల సంఖ్య 82,066కి చేరింది.