ఢిల్లీ సాకేత్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన 49 యేళ్ళ బాధితుడికి వైద్యులు ఫ్లాస్మా థెరపీ చేశారు. ఆ థెరపీతో అతడు పూర్తిగా కోలుకున్నాడు. అలాగే మరో ముగ్గురు రోగులకు కూడా ఫ్లాస్మా థెరపీ అందజేశారు. వారిలో ఒకరు ఇప్పుడు ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మారారు. మిగతా ఇద్దరిలోనూ శ్వాసకోశ సమస్యలు తీరిపోయాయి.