చైనాలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశం వుందా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడదని.. ప్రజలు భయపడాల్సిన పరిస్థితి లేదని నిపుణులు వివరణ ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ అవసరం లేదు. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్ డౌన్‌లు అవసరం లేదని చెప్తున్నారు. వీలైనంత మేర కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.