సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (13:40 IST)
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి “కరోనా” సోకడంతో రామ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16 వరకూ కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులకు హాజరైన ఉద్యోగికి “కరోనా” పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 30 వరకు “క్వారంటీన్”కి వెళ్ళారు ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌లు.
 
“కరోనా” సోకిన ఉద్యోగి ఎవరెవరిని కలిశాడన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. “లాక్‌డౌన్” ప్రారంభమైన నాటినుంచి పరిమితంగానే పనిచేస్తున్న సుప్రీంకోర్టు కేవలం “స్కెలిటన్” స్టాఫ్‌తో మాత్రమే  పనిచేస్తుంది. “ఆన్‌లైన్” ద్వారా అత్యవసర కేసులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు