రెడ్ జోన్‌లో పనిచేశారు, కరోనా అంటిచుకున్నారు, 10 మంది ప్రభుత్వ ఉద్యోగులకు...

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (23:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అయినా సరే ప్రజల్లో మాత్రం భయం తగ్గడం లేదు. ఎపిలో అయితే రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 
 
చిత్తూరు జిల్లాలో అయితే నిన్నటివరకు 28 కేసులు మాత్రమే ఉండగా ఈరోజు ఏకంగా 58కి చేరింది. ఒక్క శ్రీకాళహస్తిలో 25 కేసులు రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. శ్రీకాళహస్తిలో రెడ్ జోన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ సిబ్బందికే కరోనా సోకడం కలకలంగా మారుతోంది. 
 
ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన ముస్లింలతో ఇప్పటికే కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అదే పరిస్థితి. అయితే ముస్లింలను ఆసుపత్రులకు తరలించి.. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి.. ప్రజలెవరూ బయట తిరగకూడదని ప్రభుత్వ సిబ్బంది సూచనలిచ్చారు.
 
శ్రీకాళహస్తిలో పురపాలక సంఘం సిబ్బందితో పాటు పోలీసులు, వాలంటీర్లు ఇలా 10 మందికి కరోనా సోకింది. అంతేకాదు ఇద్దరు మెడికల్ షాపు యజమానులకు కరోనా వచ్చింది. దీంతో వీరందరనీ ఐసోలేషన్‌కు తరలించారు. ఒక్కసారిగా 25 పాజిటివ్ కేసులు నమోదవడంతో శ్రీకాళహస్తి ఉలిక్కిపడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు