హమ్మయ్య... 35 వేలకు చేరుకున్న కొత్త పాజిటివ్ కేసులు

శుక్రవారం, 23 జులై 2021 (09:58 IST)
దేశంలో కొత్తగా మరో 35 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం వెల్లడించిన ప్రకటన మేరకు.. గత 24 గంటల్లో కొత్తగా 35,342 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కు చేరింది. అలాగే, 38,740 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, మరణాల విషయానికొస్తే, గురువారం 483 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,19,470కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,04,68,079 మంది కోలుకున్నారు. 4,05,513 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 42,34,17,030 వ్యాక్సిన్ డోసులు వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు