దేశంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో మొత్తం 16,935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2.61 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
అదేసమయంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 6.48 శాతానికి పెరిగింది. ప్రస్తుత వ్యాప్తితో క్రియాశీల కేసులు 1,44,264కు చేరాయి. ఇప్పటివరకూ 4.37 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో బాధితులు 0.33 శాతంగా ఉన్నారు. నిన్న 16,069 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.47 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 51 మంది మరణించారు. ఒక్క కేరళ నుంచే 29 మరణాలు వచ్చాయి.