మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇపుడు రెండో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా సాగుతోంది. ఇందులో భారత జట్టు పట్టు బిగించింది.
రవీంద్ర జడేజా 57 పరుగులు చేశాడు. అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9 పరుగులు చేయగా, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు. సిరాజ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ రెండు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
అలాగే, లబుసర్గానే కూడా 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, ప్రస్తుత క్రీజ్‌లో మ్యాథ్యూ హేడ్ 27, స్టీవెన్ స్మిత్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.