దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్పికర్ రహీంపై విమర్శల వర్షం కురుస్తోంది. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన ముష్పికర్.. కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనని, తనను రాజీనామా చేయమని బంగ్లా క్రికెట్ బోర్డు కోరలేదని అన్నాడు.
తమ జట్టు సభ్యుల ఆటతీరుపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని తాను అనుకోవడం లేదని చెప్పాడు. కాగా, మొదటి టెస్టులో 333 పరుగులు, రెండో టెస్టులో ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. టెస్ట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి కూడా ఇదే కావడం గమనార్హం.