ఇషాంత్ ఫేస్ గేమ్ ఛాలెంజ్: బీసీసీఐ సవాల్‌కు అనూహ్య స్పందన.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా?

శుక్రవారం, 17 మార్చి 2017 (16:28 IST)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ వివాదం మ్యాచ్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్  స్మిత్‌ను వెక్కిరించి వార్తల్లో నిలిచిన ఇషాంత్ శర్మ.. పదే పదే స్మిత్‌ను టార్గెట్ చేశాడు. ప్రతి బంతికికీ స్మిత్ వైపు గుర్రుగా చూస్తూ అతడిని రెచ్చగొట్టే ప్రయత్నించాడు. దీంతో ఇషాంత్ చేసిన ఈ చర్య ఇషాంత్ గేమ్ ఫేస్ ఛాలెంజ్ అంటూ ట్విట్టర్లో పాపులరైంది. 
 
ఇందుకు బీసీసీఐ కూడా తోడు కావడంతో ట్విట్టర్లో ఈ గేమ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. తొలుత ఇషాంత్ విసిరిన ఛాలెంజ్‌ను టీలీ కామెంటేటర్లు స్వీకరించి ఇషాంత్ ఫేస్‌లా పెట్టి అతనిని అనుకరించారు. అప్పటి నుంచి ఇషాంత్‌ గేమ్‌ ఫేస్ ఛాలెంజ్‌ అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పలువురు ఇషాంత్‌ను ఫాలో అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఓ సవాల్ విసిరింది. రాంచీలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు లంచ్‌ విరామ సమయంలో కామేంటేటర్లు అందరూ ఇషాంత్‌ లాగా హావభావాలు పలికిస్తూ కనిపించారు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి క్రికెట్ అభిమానులకు ఓ సవాల్‌ విసిరింది. బీసీసీఐ విసిరిన సవాలును స్వీకరించిన ఫ్యాన్స్ కూడా ఇషాంత్ మాదిరి హావభావాలు పలికిస్తూ ఉన్న వీడియో లేదా ఫోటోలను తమతో పంచుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి