ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ క్రికెటర్ మిచెల్ జాన్సన్ విరుచుకుపడ్డాడు. కోహ్లీకి మర్యాద అంటే ఏంటో తెలియదనుకుంటానని ఎద్దేవా చేశాడు. పెర్త్‌లో ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో కోహ్లీ వాగ్వివాదానికి దిగాడు.
ప్రపంచంలోనే కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ కావచ్చు, కానీ ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు అతనికి లేవు. అయితే కెప్టెన్ కోహ్లీకి బీసీసీఐ అండగా నిలిచింది. ఆస్ట్రేలియా మీడియాలో కోహ్లీని ఉద్దేశిస్తూ ఆ దేశ మాజీ క్రికెటర్లు చేస్తున్న వార్తలను బోర్డు తీవ్రంగా ఖండించింది.
కాగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 146 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా నాలుగు మ్యాచ్‌లతో కూడిన ఈ టెస్టు సిరీస్‌లో 1-1 తేడాతో ఇరు జట్లు సమంగా వున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీని ఏకిపారేసిన మిచెల్ జాన్సన్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ విమర్శిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇంతకుముందు జాన్సన్ మైదానంలో వాగ్వివాదానికి దిగిన వీడియోలను షేర్ చేస్తూ కౌంటరిచ్చారు.