శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్.. ప్రపంచ కప్ భారత్ గెలుస్తుంది..

గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:53 IST)
Gambhir
భారత్ వేదికగా వచ్చే నెల 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించారు. 
 
ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు