టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనెసర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తొలిసారి 2012లో అశ్విన్ ఆటను చూశానని, బౌలింగ్ విధానం చూసి గొప్ప బౌలర్ అవుతాడని అప్పుడే అనిపించిందని తెలిపాడు.
ప్రస్తుతం ఫ్రీలాన్స్ స్పోర్ట్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్న పనెసర్.. 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్‌ను 'స్పిన్ బౌలింగ్‌లో ఇంజనీర్' అంటూ ప్రశంసించాడు. అశ్విన్ బ్రిలియంట్ స్పిన్నర్ అని మెచ్చుకున్నారు.
గురువారం నుంచి ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్‌కు వందో టెస్ట్ మ్యాచ్.. ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో సగటున 23.9తో అశ్విన్ 507 వికెట్లు తీశాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా రెండో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.