ట్వంటీ-20 వరల్డ్ కప్ జట్లు... భారత్ ఆడే మ్యాచ్ వివరాలివే...

శుక్రవారం, 11 డిశెంబరు 2015 (14:05 IST)
వచ్చేయేడాది భారత్ వేదికగా ట్వంటీ-20 వరల్డ్ కప్ పోటీలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు రౌండ్లలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. గ్రూప్ ఎ, గ్రూప్ బీలలో ర్యాంకుల పరంగా నాలుగేసి చిన్న దేశాలకు స్థానమిచ్చిన ఐసీసీ, వీటి మధ్య పోటీలు జరిపి, రెండు దేశాలను 'సూపర్ 10' రౌండుకు ఎంపిక చేస్తుంది.
 
ఇందులోభాగంగా గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్ దేశాలుండగా, గ్రూప్-బీలో జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, ఆఫ్గనిస్థాన్ దేశాలున్నాయి. ఒక్కో గ్రూప్‌లో టాప్‌లో నిలిచిన జట్టు సూపర్ 10కు అర్హత పొందుతుంది. 
 
ఇకపోతే.. ఇక సూపర్ 10 గ్రూప్-1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో పాటు గ్రూప్ బి విన్నర్, గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పాటు గ్రూప్ ఏ విన్నర్ ఉంటాయి. ఈ పోటీల అనంతరం గ్రూప్ దశలో టాప్-2 స్థానాలు పొందే రెండు జట్లూ సెమీఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. 

కాగా, వచ్చే యేడాది మార్చి ఎనిమిదో తేదీ నుంచి ట్వంటీ-20 టోర్నీ ప్రారంభంకానుంది. ఇందులో భారత్ ఆడే మ్యాచ్‌ల వివరాలను పరిశీలిస్తే... 2015 మార్చి 15వ తేదీ మంగళవారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్, వేదిక నాగ్‌‌పూర్. మార్చి 19వ తేదీ శనివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ (ధర్మశాల), మార్చి 23వ తేదీ బుధవారం భారత్ వర్సెస్ ఏ గ్రూపు క్వాలిఫయర్, మార్చి 27వ తేదీ ఆదివారం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, వేదిక మొహాలీలలో జరుగుతాయి. 

వెబ్దునియా పై చదవండి