ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025: అదరగొట్టిన తెలుగు యువతి త్రిష

ఐవీఆర్

మంగళవారం, 28 జనవరి 2025 (17:44 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తెలుగు యువతి త్రిష గొంగాడి చరిత్ర సృష్టించింది. మంగళవారం నాడు స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి, ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025లో తొలి సెంచరీ సాధించిన త్రిష గొంగాడి చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ సెంచరీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో తొలి సెంచరీగా కూడా నిలిచింది.
 
సానికాతో కలిసి గొంగాడి త్రిష భారత్‌ స్కోరును 208-1కి చేర్చింది. స్కాట్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, ఓపెనర్లు కమలినీ, త్రిష గొంగాడి బౌండరీలతో విరుచుకపడ్డారు. దీనితో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 67-0తో బలమైన స్కోరును సాధించింది.
 

???????????? ???????????? ????????????????????’???? ???????????? ???????????????????? ???????????? ||

India defeated Scotland by 150 runs at Bayuemas Oval Stadium in Kuala Lumpur, Malaysia.

Brief Score:
India ???????? : 208/1 (20 overs)
Scotland????????????????????????: 58/10 (14 overs)

Gongadi Trisha: 110* runs (59 balls) #INDvSCO |… pic.twitter.com/VVFIdQV5NK

— All India Radio News (@airnewsalerts) January 28, 2025
ఆటలో సగం సమయానికి, భారత్ వికెట్ నష్టపోకుండా 104 పరుగుల వద్ద దూసుకుపోతోంది. కొద్దిసేపటికే, భారత ఓపెనర్లు ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక భాగస్వామ్యానికి కొత్త రికార్డును సృష్టించారు, అద్భుతమైన 147 పరుగులు చేశారు. మరోవైపు బౌలింగులోనూ కీలకమైన 3 వికెట్లను పడగొట్టి స్కాట్లాండు నడ్డి విరిచింది. దీనితో భారత్ 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ జనవరి 31న సెమీఫైనల్ పోటీలో పాల్గొననుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు