స్త్రీపురుషుడు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. ఆ మహిళపై పురుషుడు దాడి చేయడానికి శృంగారం ఒక లైసెన్స్ కాబోదని కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక కార్యకర్తపై పోలీస్ అధికారి ఒకరు లైంగిక వేధింపులు, భౌతికదాడికి పాల్పడిన కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
బి.అశోక్ కుమార్ అనే ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సామాజిక మహిళా కార్యకర్త ఒకరు గత 2017 నుంచి 2022 వరకు పరస్పర అంగీకారంతో శృంగారంలో ఉన్నారు. ఈ క్రమంలో 2021 నవంబరు 11వ తేదీన అశోక్ కుమార్ తనను ఓ హోటల్‌కు తీసుకెళ్లి బలవంతంగా శృంగారం చేసి, భౌతికంగా దాడి చేశారంటూ ఆరోపించారు. ఆ తర్వాతి రోజు తనను ఓ బస్టాండులో విడిచిపెట్టాడని పేర్కొన్నారు.
ఆ తర్వాత ఆస్పత్రిలో చేరి గాయాలకు చికిత్స చేయించుకున్నట్టు తెలిపారు. దీనిపై బాధితరాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, అయఈ కేసును కొట్టివేయాలని సీఐ అశోక్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ మధ్య బంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని కోర్టుకు విన్నవించారు.
అయితే, ఏకాభిప్రాయంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న శారీరక బంధాన్ని నేరంగా పరిగణించలేమని, అత్యాచారం ఆరోపణలను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. అయితే, మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలకు మాత్రం బలం ఉందని కోర్టు స్పష్టం చేస్తూ, ఈ విషయంలో పోలీసులు విచారణ కొనసాగించాలని ఆదేశించింది.