హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత తుది జట్టులోకి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లకు చోటు కల్పించారు.
కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్, శ్రేయాస్ అయ్యర్ ప్లేసులో సూర్యకుమార్ యాదవ్‌లను తీసుకున్నారు. అలాగే, శ్రీలంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లోకి తిరిగివచ్చాడు. స్పిన్ ఆల్ రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను కొనసాగించారు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించారు. ఉమ్రాన్ మాలిక్ బదులు శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఇది తన సొంతగడ్డపై తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
కాగా, తుది జట్ల వివరాలను పరిశీలిస్తే....
భారత్ : రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కిషన్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, ఠాకూర్, కుల్దీప్ సింగ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : అలెన్, నికోల్స్, కాన్వే, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, సాంట్నర్, షప్లీ, ఫెర్గ్యూసన్, టిక్నర్.