ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు.
ప్రాథమిక జట్టు వివరాల అంచనా.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా లేదా ప్రసిద్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ లేదా జురెల్‌కు అవకాశం లభించవచ్చు.