ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పింది.. సారీ చెప్పే ప్రసక్తే లేదు: విలియమ్సన్

ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:39 IST)
వైజాగ్ వేదికగా భారత్‌తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని, అయినప్పటికీ సారీ చెప్పే ప్రసక్తే లేదనీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేల్చి చెప్పాడు.
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం విశాఖ వేదికగా జరిగిన చివరి వన్డేలో కివీస్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై కేన్ స్పందిస్తూ తమ జట్టు ఘోరంగా వైఫల్యం చెందిందని, టర్న్ తిరుగుతున్న బంతులను ఎదుర్కొనడంలో అందరం విఫలమయ్యామని, ఈ విషయంలో క్షమాపణ చెప్పే అవసరం ఏమీ లేదన్నారు. 
 
కేవలం 16 పరుగుల వ్యవధిలో 8 మంది పెవీలియన్ దారి పట్టడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, ఈ ఓటమి తమకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నాడు. దారుణంగా ఓడిపోవడం బాధాకరమే అయినా, జట్టును చక్కదిద్దుకోవడానికి తమకు మంచి అవకాశం లభించిందని అన్నాడు. 

వెబ్దునియా పై చదవండి