ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. తద్వారా శిక్షకు గురైయ్యాడు. బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కేకేఆర్‌కు విజయం ఖరారయ్యే సమయంలో ఆవేశానికి లోనైన గౌతం గంభీర్.. సూర్యకుమార్ బౌండరీ కొట్టగానే డగౌట్లో ఉన్న కుర్చీని తన కాలితో తన్నడంతో అయ్యగారికి శిక్ష తప్పలేదు.