ఇందులో భాగంగా, ఇప్పటికే ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఈ తరహా ఆఫర్ వెళ్లినట్టు సమాచారం. ఈ మేరకు టైమ్స్ లండన్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కాకపోతే, ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని సంప్రదించిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ప్రాథమిక చర్యలు నడిచాయని, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఇంగ్లీష్ కౌంటీలతు సంబంధం లేకుండా వారు పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాడిగా కొనసాగాల్సి వుంది.
ఇదిలావుంటే, ఐపీఎల్ ఇపుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను రూ.50 వేల కోట్లకుపైగానే అమ్ముడు పోయాయంటే ఐపీఎల్ ఆదరణ ఏ స్థాయిలో ఉందే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.