మేనేజర్‌తో పాటు అధిక వేతనంతో కూడిన ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఇది మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. అందువల్ల జీతం తక్కువగా ఉన్నా మనశ్శాంతితో కూడిన ఉద్యోగం కావాలని 88 శాతం మంది భారతీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అలాగే, 70% అమెరికన్లు మానసిక ప్రశాంతతతో కూడిన తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం తమకు ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలోని 10 దేశాల్లో నిర్వహించిన ఈ పోల్‌లో ఎక్కువ మంది ఎక్కువ జీతం కంటే మనశ్శాంతి, ప్రశాంతతను కోరుకుంటున్నారని వెల్లడైంది.