హెన్రిచ్ క్లాసెన్ కుమార్తె వీడియో వైరల్

సెల్వి

శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (15:01 IST)
Klassen with his daughter Cutest video of the day
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బిగ్ హిట్టర్లలో ఒకరిగా పేరుగాంచిన హెన్రిచ్ క్లాసెన్ కుమార్తె ఫోటోలు, వీడియోలు ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. డిసెంబర్ 2, 2022న వారి కుమార్తె లయ రాకతో క్లాసెన్, అతని భార్య సోన్ మార్టిన్స్ పేరెంట్‌హుడ్‌ని స్వీకరించారు. 
 
ఈ జంట 2015లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబం పట్ల తన నిబద్ధతకు అంకితమైన క్లాసెన్ తరచుగా తన భార్య, కుమార్తెతో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో లయతో క్లాసెన్ గారాబంగా ఎత్తుకున్నాడు. ఆమెకు ముద్దులిస్తూ ఒడిపై కూర్చుండబెట్టుకుని కాసేపు గడిపాడు. ఈ వీడియోలో లయ చాలా క్యూట్‌గా కనిపించింది. 
 
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బిగ్ హిట్టర్లలో ఒకరిగా పేరుగాంచిన హెన్రిచ్ క్లాసెన్, ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌పై (మార్చి 27న) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 31 పరుగుల విజయాన్ని సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 
 
అలాగే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి వచ్చాడు. అతడు ఈ మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయినా 5 మ్యాచ్ లలో 186 పరుగులతో కోహ్లి, సాయి సుదర్శన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

Klassen with his daughter - Cutest video of the day. ❤️pic.twitter.com/yxLfaZ1LDJ

— Johns. (@CricCrazyJohns) April 12, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు