ముత్తయ్య మురళీధరన్‌కి గుండె సంబంధిత సమస్య.. సన్‌రైజర్స్‌కు షాక్

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (14:24 IST)
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌కి ఉన్నట్టుండి గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయన్ని... చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఏప్రిల్ 17నే ఆయన 49వ ఏట అడుగుపెట్టారు. పుట్టిన రోజు జరిగిన రెండు రోజులకే ఈ అనారోగ్య సమస్య రావడం క్రికెట్ ప్రపంచానికి ఆందోళన కలిగించింది. ప్రస్తుతం ఈ హాఫ్ స్పిన్నర్... అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. 
 
గుండె సంబంధిత సమస్య కారణంగా ముత్తయ్యకు యాంజియోప్లాస్టీ చేయబోతున్నట్లు తెలిసింది. మురళీధరన్... 2015 నుంచి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి కోచ్‌గా ఉంటున్నారు. అలాగే టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ఘనత ముత్తయ్యదే. ప్రపంచంలో మరే ప్లేయర్ ఇన్ని వికెట్లు తియ్యలేదు. అందువల్ల ఆ రికార్డ్ ఆయన పేరు మీదే ఉంది. 
 
శ్రీలంక క్రికెట్‌లో అడుగు పెట్టినప్పుడు ఆయన బౌలింగ్ యాక్షన్ చూసి అంతా షాక్ అయ్యారు. అదేంటి అలా వేస్తున్నాడు అని అనుమానించారు. ప్రపంచ క్రికెట్ నుంచి ఆయన్ని తప్పించేంత దాకా వెళ్లింది ఆ వివాదం. 
 
ఐతే... ఇలాంటి వివాదాలన్నింటినీ ఎదుర్కొంటూ ముత్తయ్య మురళీధరన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో  కూడా 534 వికెట్లు తీశాడు. అంతేకాదు... 66 మ్యాచుల్లో 63 వికెట్లు కుప్పకూల్చాడు. అలాంటి ఆయన ఆస్పత్రి పాలవడంతో... క్రికెట్ అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు