దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని వినిపించడం, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవడం తప్పనిసరి అని గత యేడాది నవంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీన్ని సవరిస్తూ ఇటీవల ఆదేశించింది.
ప్రజలు తమ దేశభక్తి రుజువు చేసుకోవాలంటే సినిమా హాళ్లలో లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిని దేశభక్తి లేనివారిగా పరిగణించరాదని తాజాగా వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించడానికి వీలుగా సినిమా మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని వినిపించడం, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవడం తప్పనిసరి అని గత యేడాది నవంబరులో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో క్రికెటర్ గౌతం గంభీర్ గంభీరమైన ట్వీట్స్ చేశారు. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'క్లబ్‌కి వెళ్తే సుమారు 20 నిమిషాల పాటు బయట నిల్చుని ఎదురుచూస్తాం, రెస్టారెంట్‌కి వెళ్తే 30 నిమిషాల పాటు బయట నిల్చుటాం. జాతీయ గీతం వినిపించినప్పుడు 52 సెకండ్ల పాటు నిల్చోలేమా.. ఇది కష్టమా' అంటూ ప్రశ్నించాడు.
గంభీర్‌కు దేశభక్తి ఎక్కువ. దేశంపై తనకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటాడు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అనేక మంది జవాన్ల పిల్లల్ని చదివిస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది ఐపీఎల్‌లో నగదు రూపంలో అందుకున్న మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందజేశాడు.